Home   »  జీవన శైలివార్తలు   »   11 రోజుల్లో 1.37 లక్షల మంది అమర్‌నాథ్ యాత్ర ను సందర్శించారు

11 రోజుల్లో 1.37 లక్షల మంది అమర్‌నాథ్ యాత్ర ను సందర్శించారు

schedule sirisha

శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అంటే గత 11 రోజులుగా కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర ను 1.37 లక్షల మంది యాత్రికులు మంచుతో తయారయ్యే లింగరూపంలో వున్న ఆ మహాశివుడిని దర్శించుకున్నారు.

మంగళవారం 18,000 మంది యాత్రికులు పవిత్ర గుహ లోపల ‘దర్శనం’ పొందారు. మరో 6,554 మంది యాత్రికులు ఈ రోజు ఉదయం జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుండి లోయకు బయలుదేరారు” అని అధికారులు తెలిపారు.

జమ్మూ-శ్రీనగర్ హైవే దిగ్బంధనం కారణంగా జమ్మూ నుండి లోయకు యాత్రికుల మార్గం నాలుగు రోజులు నిలిచిపోయింది. ఈ రోజు ట్రాఫిక్ కోసం తిరిగి తెరవబడింది. చిక్కుకున్న వాహనాలు మరియు అమర్‌నాథ్ యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

సాంప్రదాయ పహల్గామ్ మార్గాన్ని ఉపయోగించే వారు గుహ మందిరానికి చేరుకోవడానికి 3-4 రోజులు పడుతుంది. అయితే బాల్తాల్ మార్గంలో ఉన్నవారు సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ మందిరంలో దర్శనం తర్వాత అదే రోజు బేస్ క్యాంపుకు తిరిగి వస్తారు.