Home   »  ఉద్యోగంతెలంగాణవార్తలు   »   MBBS కోర్సుకు తెలంగాణ విద్యార్థులకు100% మేనేజ్‌మెంట్ సీట్లు

MBBS కోర్సుకు తెలంగాణ విద్యార్థులకు100% మేనేజ్‌మెంట్ సీట్లు

schedule sirisha

హైదరాబాద్: MBBS కోర్సును అభ్యసించనున్న తెలంగాణ విద్యార్థులకు 100 శాతం మేనేజ్‌మెంట్ సీట్ల కోటాను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రాష్ట్రం ఆమోదించిన ప్రభుత్వ ఉత్తర్వు (GO) జూన్ 2, 2014 తర్వాత స్థాపించబడిన కళాశాలల్లో అమలు చేయబడుతుంది. కాంపిటెంట్ అథారిటీ కోటా కింద సవరించిన అడ్మిషన్ విధానంలో 85 శాతం రిజర్వేషన్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు మాత్రమేనని, మిగిలిన 15 శాతం అన్‌రిజర్వ్‌డ్‌గా కేటాయిస్తారు.

2014కి ముందు 85 శాతం MBBS సీట్లు స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. మిగిలిన 15 శాతం సీట్లను ఏదైనా ప్రాంతం నుండి వచ్చిన వారికి సీట్లు కేటాయించే వారు. ఇప్పుడు ఈ విధానంలో మార్పు తీసుకు వచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం.