Home   »  వార్తలు   »   రాష్ట్రానికి రూ.700 కోట్ల పెట్టుబడులు: KTR

రాష్ట్రానికి రూ.700 కోట్ల పెట్టుబడులు: KTR

schedule mounika

తెలంగాణ రాష్ట్రానికి రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు UAE సంస్థ ముందుకొచ్చినట్లు మంత్రి
KTR ట్వీట్ చేశారు. దుబాయ్ పర్యటనలో కేటీఆర్‌తో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ ప్రతినిధి బృందం జరిగిన సమావేశంలో నాఫ్ కో సంస్థ అగ్నిమాపక పరికరాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయ‌నున్న‌ట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా రూ. 700 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది.

తెలంగాణతో పాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని నాఫ్‌కో తెలిపింది. తెలంగాణ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్ర‌క్ష‌న్‌తో అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని తెలిపారు.