Home   »  అంతర్జాతీయంజాతీయంవార్తలు   »   ఆలయంపై కొండ చరియలు పడటంతో 9 మంది మృతి..

ఆలయంపై కొండ చరియలు పడటంతో 9 మంది మృతి..

schedule mounika

ఆలయంపై కొండ చరియలు పడటంతో 9మంది మృతి చెందారు. సోమవారం హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పక్కనే ఉన్న ఆలయంపై పడ్డాయి. దీంతో దేవాలయానికి వచ్చిన వారిలో సుమారు 9 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి పలు చోట్ల ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం శిమ్లా లోని ఓ ఆలయం పై కొండచరియలు విరిగిపడి 9 మృతిచెందారు. సోమవారం ఉదయం సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల ధాటికి ఆలయం కుప్పకూలింది. శిథిలాల కింద పదుల సంఖ్యలో భక్తులు చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద మరో 20మంది కి పైనే ఉన్నట్లు చెబుతున్నారు. నేడు శ్రావణ సోమవారం కావడంతో ఉదయం నుంచే శివాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ప్రమాద సమయంలో ఆలయం వద్ద దాదాపు 50 మంది వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు..