Home   »  వార్తలుతెలంగాణ   »   హన్మకొండలో 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి

హన్మకొండలో 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి

schedule sirisha

హన్మకొండ: కోమట్‌పల్లి టోల్‌గెట్ సమీపంలో 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి కి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ పోలీసులు అన్వేష్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

ACP కిరణ్ కుమార్ కథనం ప్రకారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు హన్మకొండకు చెందిన కె అన్వేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అన్వేష్‌ అనే వ్యక్తి బాధితురాలి మిత్రుడు అఖిల్‌కు స్నేహితుడు కాగా ముగ్గురు కలిసి రామప్ప ఆలయానికి వెళ్లి హన్మకొండకు తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది” అని పోలీసు అధికారి తెలిపారు.

అన్వేష్ టోల్ ప్లాజా దగ్గర మంచినీళ్ల కోసం ఆగి సమీపంలోని దుకాణం నుండి వాటర్ బాటిల్ కొని తీసుకురా అని అఖిల్‌ని పంపాడు. ఇదే అదును అనుకోని పక్కనే వున్న పొదల్లోకి ఉపశమనం పొందేందుకు వెళ్లిన మహిళపై అన్వేష్ లైంగిక దాడి కి పాల్పడ్డాడు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.