Home   »  వార్తలు   »   పాలు కొనడానికి బయలుదేరిన 4 ఏళ్ల బాలిక నల్లాలోకి జారిపడి మరణించింది.

పాలు కొనడానికి బయలుదేరిన 4 ఏళ్ల బాలిక నల్లాలోకి జారిపడి మరణించింది.

schedule chiranjeevi

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మౌనిక మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. చిన్నారి మౌనిక మృతి పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఇంకుడు గుంతలను మూసివేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

నగరంలో తెల్లవారుజామున కుండపోత వర్షం కురవడంతో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్‌ను తెరిచారు. పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. చివరకు పార్క్ లైన్ మ్యాన్ హోల్ వద్ద చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మౌనిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మౌనిక ప్రస్తుతం స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. మౌనిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే మౌనిక ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో చిన్నారులు మ్యాన్‌హోల్స్‌లో పడి చనిపోవడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి ఘటనలు నగరంలో గతంలో చాలానే జరిగాయి. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

మ్యాన్‌హోల్స్‌ తెరిచినప్పుడు అక్కడికి ఎవరూ వెళ్లకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలి. హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కానీ సిబ్బంది ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మ్యాన్ హోల్స్ లో పడి పలువురు మృతి చెందారు. వర్షాకాలంలో రోడ్లన్నీ జలమయమవుతాయి. దీంతో మ్యాన్ హోళ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఇలాంటి సమయంలో రోడ్లపై నడిచే వారికి మ్యాన్ హోళ్లు కనిపించవు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. రోడ్డు మరమ్మతులు, ఇతర పనుల కోసం మ్యాన్ హోళ్లను తెరుస్తున్న సిబ్బంది వాటిని మూయకుండా వదిలేస్తున్నారు. దీంతో ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్స్‌లో పడే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేసే సిబ్బంది.. మళ్లీ పట్టించుకోవడం లేదు.