Home   »  వార్తలు   »   లిఫ్ట్ ఇరుక్కుపోయిన బాలుడు..

లిఫ్ట్ ఇరుక్కుపోయిన బాలుడు..

schedule mounika

హర్యానా : లిఫ్ట్ ఇరుక్కుపోయిన బాలుడు.. ఏం చేశాడంటే? హర్యానా ఫరీదాబాద్లో 8 ఏళ్ల బాలుడు 2 గంటల పాటు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఘటనపై నెట్టింట చర్చ జరుగుతోంది . ట్యూషన్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లేందుకు బాలుడు లిఫ్ట్ ఎక్కాడు . అయితే, ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయింది. ఆ సమయంలో అందులో చిక్కుకుపోయిన వారి భయం, బాధ వర్ణనాతీతం.

ఆ లిఫ్ట్‌లో ఉండి భయంతో చనిపోయినవారు కూడా ఉన్నారు. మనం ఎన్నో సినిమాల్లో కూడా లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి భయంతో అరుపులు, కేకలు పెట్టిన సంఘటనలు కూడా చూశాం. కానీ లిఫ్ట్ ఇరుక్కుపోయిన బాలుడు అందరిలా భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా తన హోమ్ వర్క్ చేసుకున్నాడు. బాలుడు ట్యూషన్ కు రాలేదని పేరెంట్సకు కాల్ చేసి చెప్పాక.. లిఫ్ట్ ఇరుక్కుపోయినట్లు గుర్తించారు.