Home   »  వార్తలు   »   ఆకేరు వాగు వరద ప్రవాహాన్ని సందర్శించిన BRS నేత

ఆకేరు వాగు వరద ప్రవాహాన్ని సందర్శించిన BRS నేత

schedule sirisha

మహబూబాబాద్ మున్సిపల్ పరిధి లోని జమాండ్లపల్లి, నెల్లికుదురు మండలం లోని వావిలాల, నెల్లికుదురు మండలం కాచికల్, తొర్రూరు మండలం మడిపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న ఆకేరు వాగు వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర అధికారులతో కలిసి ఎస్టీ సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు.

వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అని ఆమె తెలిపారు.

భారీ వర్షాలు నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అత్యవసర సమయంలో మాత్రమే బయటికి వెళ్లాలని మంత్రి సత్యవతి వెల్లడించారు.