Home   »  జాతీయంవార్తలు   »   ఢిల్లీలోని సౌందర్య సాధనాల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలోని సౌందర్య సాధనాల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

schedule sirisha

ఢిల్లీ: ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ప్రాంతంలోని సౌందర్య సాధనాల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ (DFS) అతుల్ గార్గ్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఆజాద్‌పూర్ మార్కెట్‌లోని ప్రతాప్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని గోడౌన్‌లో మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక బృందానికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకున్నారు.

“మొత్తం ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి రెండు గంటల సమయం పట్టింది” ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇది షాట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకొని ఉండవచ్చు అని DFS అధికారి తెలిపారు.