Home   »  వార్తలుఅంతర్జాతీయంజీవన శైలిటెక్నాలజీ   »   మళ్లీ మెర్స్‌-కోవ్‌ కలకలం.. తొలి కేసు నమోదు..

మళ్లీ మెర్స్‌-కోవ్‌ కలకలం.. తొలి కేసు నమోదు..

schedule yuvaraju

సౌదీ అరేబియా: కరోనా నుంచి కోలుకుంటున్న ప్రపంచానికి మరో పెద్ద వార్త. కోవిడ్ కుటుంబానికి చెందిన ఘోరమైన మెర్స్‌-కోవ్‌ మళ్లీ కలకలం రేపుతోంది. అబుదాబిలో 28 ఏళ్ల వ్యక్తిలో ఈ వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడింది. అతనికి దగ్గరగా ఉన్న 108 మందికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రిజల్ట్ వచ్చింది. ఒంటెల వంటి జంతువుల ద్వారా ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు.

పంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,605 మెర్స్‌-కోవ్ కేసులు నమోదు కాగా, 936 మరణాలు సంభవించాయి. ఈ వైరస్‌ సోకితే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ సోకిన వారిలో మరణాల రేటు అధికంగానే ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. మెర్స్‌-కోవ్‌ వైరస్ మొదటిసారిగా సౌదీ అరేబియాలో 2012లో కనిపించింది.