Home   »  వార్తలు   »   ఐదు విప్లవాలతో తెలంగాణ అద్భుత ప్రగతి… కేటీఆర్!

ఐదు విప్లవాలతో తెలంగాణ అద్భుత ప్రగతి… కేటీఆర్!

schedule chiranjeevi

హైదరాబాద్: నీటి పారుదల రంగం నుంచి సుజల రంగం వరక. తమ పార్టీ ప్రగతిపథంలో దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ దార్శనికత దేశానికి మార్గదర్శకమని బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. మన ముఖ్యమంత్రి దూరదృష్టితోనే ఇదంతా సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.ఇటీవల ఓ పెద్ద మనిషిని కలిసినప్పుడు ‘మీ ముఖ్యమంత్రి ఉద్యమనేత మాత్రమే కాదు, మంచి పరిపాలనాదక్షుడు కూడా’ అని అన్నారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సమగ్ర, సమతూకం, సమ్మిళిత అభివృద్ధి అన్ని కేసీఆర్ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందన్నారు.

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: నీటి రంగం నుంచి సుజల రంగం వరకు… తమ పార్టీ ప్రగతిపథంలో దూసుకుపోతోందని, సీఎం కేసీఆర్ దార్శనికత దేశానికి మార్గదర్శకమని బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. మన ముఖ్యమంత్రి దూరదృష్టితోనే ఇదంతా సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇటీవల ఓ పెద్ద మనిషిని కలిసినప్పుడు ‘మీ ముఖ్యమంత్రి ఉద్యమనేత మాత్రమే కాదు, మంచి పరిపాలనాదక్షుడు కూడా’ అని అన్నారని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పడ్డాక సకల జనుల సర్వే నిర్వహించి జనాభా గణాంకాలతో అభివృద్ధిని సుసంపన్నం చేశామన్నారు కేటీఆర్. దేశంలోనే 2.8 శాతం జనాభా ఉన్న తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కోసం 30 శాతం అవార్డులు సాధించిందన్నారు.
ప్రజలకు ఏం కావాలో మా నాయకుడికి తెలుసు ఇతరులకు తెలియదని మేధావులు అంటున్నారని కేటీఆర్ ప్రస్తావించారు. అందుకే తెలంగాణలో ఇంత అభివృద్ధి సాధ్యమైందని వ్యాఖ్యానించారు. గ్రామాలే కాకుండా పట్టణాలు కూడా గుణాత్మక అభివృద్ధి నమోదు చేస్తున్నాయన్నారు. పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా పారిశ్రామికీకరణ కొనసాగుతోందని ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగిందని, విద్య, వైద్యం, గురుకులాల భారీ స్థాపన – తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందిదని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనే అభివృద్ధికి మూలమని. సహజవనరులను ఎలా వినియోగించుకోవాలో తెలిసిన ప్రభుత్వాలు దేశంలో లేవని. సీఎం కేసీఆర్ పిడికిలి బిగిస్తే “అబ్కీ బార్ కిసాన్ సర్కార్”, దేశం మొత్తం గొప్పగా స్పందిస్తుంది. దానికి మహారాష్ట్రలో విజయవంతమైన సభలే నిదర్శనం. అని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చ, తెలుపు (పాలు), నీలం (చేప), గులాబీ (మాంసం), పసుపు (ఆయిల్ ఫామ్) అనే ఐదు విప్లవాలతో పురోగమిస్తోందన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు మాత్రమే 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దేశంలో ఎన్నడూ జరగలేదన్నారు. యువత రాజకీయాల వైపు చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు ప్రతి అంశాన్ని మన జీవితాలను ప్రభావితం చేస్తున్నప్పుడు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పులు చేయడం తప్పు అని మాట్లాడే రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని అన్నారు.