Home   »  వార్తలుఅంతర్జాతీయంజీవన శైలి   »   బద్ధలైన అగ్నిపర్వతం ..విరజిమ్ముతున్న లావా.

బద్ధలైన అగ్నిపర్వతం ..విరజిమ్ముతున్న లావా.

schedule yuvaraju

ఐస్లాండ్‌: ఇటీవల ఐస్‌లాండ్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫలితంగా ఐస్ లాండ్ రాజధాని రెక్జావిక్ సమీపంలో అగ్నిపర్వతం బద్దలైంది. మండుతున్న పర్వతం పెద్ద శబ్ధంతో పేలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ అగ్నిపర్వతం ప్రభావం ప్రజలపై పడదని వాతావరణ శాఖ ప్రతినిధి తెలిపారు. అగ్నిపర్వతం బద్దలయ్యాక పగుళ్ల నుంచి లావా ప్రవహిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అగ్నిపర్వతం మరోసారి బద్దలయ్యే ప్రమాదం ఉందని, సమీపంలోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.