Home   »  వార్తలుఅంతర్జాతీయం   »   పాకిస్తాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్.. క్లారిటీ

పాకిస్తాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్.. క్లారిటీ

schedule mounika

పాకిస్తాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్.. క్లారిటీ ఇచ్చిన భారత్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ మరో సర్జికల్ చేసిందని వ్యాపించిన వదంతుల పై రక్షణ శాఖ మంగళవారం స్పందించింది. అన్ని అబద్ధాలని,సర్జికల్ స్ట్రైక్ చేయలేదని స్పష్టం చేసింది.

భారత సైన్యం మరోసారి పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘బాలాకోట్ సెక్టార్, హమీర్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు వాతావరణం అలుముకుంది. దీన్నిఅనుకూలంగా భావించిన ఇద్దరు ఉగ్రవాదులు భరత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వీరిని మన సైన్యం గుర్తించి చొరబాటు యత్నాన్ని విఫలం చేసింది. ఇది సర్జికల్ కాదు’ అని వివరించింది.