Home   »  వార్తలుఆంధ్రప్రదేశ్జాతీయంరాజకీయం   »   చంద్రబాబుపై రాళ్ల దాడికి యత్నం….!

చంద్రబాబుపై రాళ్ల దాడికి యత్నం….!

schedule yuvaraju

అన్నమయ్య: కురబలకోట మండలంలోని అంగళ్లు రణరంగాన్ని తలపించింది. చంద్రబాబు పర్యటనను YSRCP కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయనపై చెప్పులు, రాళ్లు విసిరేందుకు యత్నించారు. దీంతో NSG కమాండోలు చంద్రబాబుకు రక్షణగా నిలిచారు. దీంతో వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే ఎదురుగా రావాలన్నారు. ఇలా మాపై రాళ్ల దాడి చేయడం మంచిది కాదు అని అన్నారు.

చంద్రబాబు అంగళ్లుకు వచ్చే సమయానికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ బ్యానర్లను తొలగించారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు.