Home   »  వార్తలురాజకీయం   »   నాడు కరెంటు కూడ లేని గుడ్డి తెలంగాణ…. మరినేడు…!

నాడు కరెంటు కూడ లేని గుడ్డి తెలంగాణ…. మరినేడు…!

schedule sirisha

తెలంగాణ: ఒక నాడు అంధకార తెలంగాణ రోజుకు 9 గంటల కరెంటు కూడ లేని గుడ్డి తెలంగాణ, నేడు సుభిక్ష పాలనలో 24 గంటల కరెంటుతో దేదీప్యమానంగా వెలుగు జిలుగులతో విరాజిల్లుతున్న సగర్వ తెలంగాణ అని ట్విట్టర్ ని వేదికగా చేసుకొని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

నాడు సమైక్య రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు సైతం కరెంటు కోసం రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి. నేడు స్వరాష్ట్రంలో, దేశంలో ఎక్కడాలేని విధంగా, విద్యుత్తు కోతలు లేకుండా, అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే రావాలని కోరుకుంటున్నామని BRS నేతలు అన్నారు.