Home   »  వార్తలు   »   ఢిల్లీలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు

schedule chiranjeevi

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. దక్షిణ ఢిల్లీ పుష్ప్ విహార్ ప్రాంతంలోని అమృత స్కూల్‌కు మంగళవారం ఉదయం 6:33 గంటలకు ఇ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పాఠశాల విద్యార్థులను సిబ్బందిని అక్కడి నుంచి తరలించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్ పాఠశాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు.

అయితే ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు పలు పాఠశాలలకు ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. మధుర రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో బాంబు బెదిరింపులు వచ్చాయి. గతంలో సాదిక్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో బాంబులు ఉన్నాయని గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బెదిరించారు.

ఈ ఘటన ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.