Home   »  వార్తలు   »   కాకినాడ లో రేబిస్‌తో బాలుడు మృతి…..

కాకినాడ లో రేబిస్‌తో బాలుడు మృతి…..

schedule sirisha

కాకినాడ: కుక్క కరిచిన విషయం గురించి ఇంట్లో చెబితే తల్లిదండ్రులు తిడతారని భయపడిన ఓ బాలుడు ఆరు నెలలకే రేబిస్ వ్యాధితో మృతి చెందాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామంలో వెలుగు చూసింది.

6 నెలల క్రితం తేలు ఓంసాయి అనే 17 ఏళ్ల బాలుడిని వీధికుక్క కరిచింది. కానీ ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం బాలుడికి తీవ్ర జ్వరం వచ్చింది. సాయి నీళ్లను చూసి భయపడటం గమనించిన కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్‌లో చేర్పించారు. వ్యాధి ఎక్కువ అవడంతో అతడు మృతి చెందాడు.

కుక్కకాటుకు గురైన రోజునే యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు టీటీ ఇంజక్షన్ కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తర్వాత 3వ రోజు, 7వ రోజు, 28వ రోజు వ్యాక్సిన్ వేసుకుంటే రేబిస్ ముప్పు నుండి తప్పించుకోవచ్చు.