Home   »  వార్తలుఉద్యోగంటెక్నాలజీతెలంగాణ   »   మహిళా గురుకులాల్లో BSc అగ్రికల్చర్  కోర్సు… వివరాలివే..!

మహిళా గురుకులాల్లో BSc అగ్రికల్చర్  కోర్సు… వివరాలివే..!

schedule yuvaraju

తెలంగాణ: మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో (MJPTBCWREIS) 2023-24 విద్యా సంవత్సరానికి BSc అగ్రికల్చర్ (ఆనర్స్) ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పూర్తి వివరాలు:

కోర్సు: BSc అగ్రికల్చర్ (ఆనర్స్‌)

వ్యవధి: నాలుగేండ్లు

కాలేజీల వారీగా సీట్లు

  • వ్యవసాయ కళాశాల- వనపర్తి- 120
  • వ్యవసాయ కళాశాల- కరీంనగర్‌- 120

అర్హతలు: ఇంటర్‌ (బైపీసీ) లేదా డిప్లొమా (అగ్రికల్చర్‌/సీడ్‌ టెక్నాలజీ లేదా ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌) ఉత్తీర్ణత.

  • తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలు
    మించరాదు.

వయస్సు: 17-22 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఎంసెట్‌-2023 లేదా పీజేటీఎస్‌యూ అగ్రిసెట్‌-2023లో సాధించిన ర్యాంక్‌ ద్వారా.

నోట్‌: రాష్ర్టానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: https://ug.mjptbcwreis.net