Home   »  వార్తలు   »   లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసిన – CBI

లంచం తీసుకుంటూ పట్టుపడ్డ ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసిన – CBI

schedule sirisha

విశాఖపట్నంలోని ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌ (PCDA) కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ ఆడిటర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో పాటు కాంట్రాక్టర్‌, ఒకరు ప్రైవేట్‌ వ్యక్తి ఈ నలుగురిని లంచం కేసులో CBI అరెస్ట్ చేసింది.

నిందితుడు లంచం తీసుకున్నట్లు CBI ఆరోపించింది. బకాయి ఉన్న రూ.26 లక్షల బిల్లును సెటిల్‌ చేసేందుకు సీనియర్ ఆడిటర్ కాంట్రాక్టర్‌ నుంచి రూ.26వేలు డిమాండ్‌ చేసినట్లు CBI వెల్లడించింది.

కాంట్రాక్టర్ తన ప్రతినిధి ద్వారా నిందితుడికి రూ.26,000 పంపినట్లు ఆరోపణలున్నాయి. ఫిర్యాదు మేరకు రూ.26వేలు లంచం తీసుకుంటూ ఉండగా సీనియర్ అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌లను పట్టుకుని CBI అరెస్ట్ చేసింది.

అనంతరం కాంట్రాక్టర్‌ను కూడా పట్టుకున్నారు. నిందితుడి ఆస్తుల సోదాల్లో అనేక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను విశాఖపట్నంలోని సీబీఐ కేసుల ప్రధాన న్యాయమూర్తి విచారించి 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని నిర్ణయించారు.