Home   »  వార్తలువినోదం   »   వామ్మో! నాని భారీ టార్గెట్..

వామ్మో! నాని భారీ టార్గెట్..

schedule raju

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘దసరా’. ఎస్.ఎల్‌.వి.సినిమా బ్యాన‌ర్‌పై శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న సినిమా రిలీజ్ అవుతుంది .  ముఖ్యంగా రెండు విష‌యాల్లో .. అందులో ఒక‌టి ‘దసరా’ పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఇక రెండో పాయింట్.. ఇప్ప‌టి వ‌ర‌కు నాని త‌న కెరీర్‌లో న‌టించ‌ని స్టైల్లో రా అండ్ ర‌స్టిక్‌గా చేసిన సినిమా ఇదే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు.. అందులో నాని లుక్‌, కీర్తి సురేష్ క్యారెక్ట‌ర్‌.. సినిమాను తెర‌కెక్కించిన బ్యాక్ డ్రాప్ ఇలా అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను ఓ రేంజ్‌లో పెంచేశాయ‌నే చెప్పాలి.

తాజాగా ఈ సినిమా థియేట్రిక‌ల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిశాయి. నాని కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ థియేట్రిక‌ల్ బిజినెస్ ‘దసరా’ సినిమాకు జ‌రిగింది.ఈ సినిమా ఐదు భాష‌ల్లో రిలీజ్ అవుతుంది.