Home   »  వార్తలు   »   మణికొండలో డెలివరీ వ్యక్తిపై కుక్క దాడి చేసింది

మణికొండలో డెలివరీ వ్యక్తిపై కుక్క దాడి చేసింది

schedule sirisha

మణికొండ: డెలివరీ మ్యాన్‌పై కుక్క దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన మ్యాట్రెస్‌ను డెలివరీ చేసేందుకు మణికొండ ప్రాంతంలోని పంచవటి కాలనీకి వెళ్లిన అమెజాన్ డెలివరీ వ్యక్తి పైకీ అకస్మాత్తుగా కుక్క దాడి చేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునే క్రమంలో డెలివరీ మ్యాన్ మూడో అంతస్తు నుంచి దూకాడు.

బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు తరువాత ఆసుపత్రికి తరలించారు.