Home   »  జాతీయంవార్తలు   »   ఢిల్లీ లో డెంగ్యూ విజృంభణ

ఢిల్లీ లో డెంగ్యూ విజృంభణ

schedule raju

దేశ రాజధాని ఢిల్లీ లో డెంగ్యూ విజృంభిస్తోంది. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు కేవలం ఏడు రోజుల్లో 105 కొత్త కేసులు నమోదయ్యాయని ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ నివేదికలో వెల్లడించింది. దాంతో ఢిల్లీ లో ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదైన మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 348కి చేరింది. 2018 నుంచి ఇప్పటివరకు గడిచిన ఐదేండ్లలో ఆగస్టు 6 నాటికే డెంగీ కేసుల సంఖ్య 175 దాటడం ఇదే తొలిసారి.

ఈ 348 కేసుల జోనల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం వీటిలో 191 కేసులు MCD ప్రాంతాలలో, 32 NDMC ప్రాంతంలో మరియు 19 కేసులు ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలలో, ఆరు రైల్వే పరిధిలో ఉండగా, 110 కేసులు కనుగొనబడలేదు.