Home   »  వార్తలుతెలంగాణ   »   తెలంగాణ సర్కార్‌‌పై రెచ్చిపోయిన డింపుల్ హయాతి…

తెలంగాణ సర్కార్‌‌పై రెచ్చిపోయిన డింపుల్ హయాతి…

schedule mounika

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌‌పై రెచ్చిపోయిన డింపుల్ హయాతి. టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి ‘ఖిలాడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల తెలంగాణ ట్రాఫిక్ గురించి పలు పోస్టులు చేసి పెద్ద దుమారం రేపింది. అంతేకాకుండా డిసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీకొట్టి ,ధ్వంసం చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనపై క్రిమినల్ కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఈ అమ్మడు నిత్యం సర్కార్‌పై పలు వివాదాస్పద పోస్టులతో రచ్చ చేస్తోంది. తాజాగా డింపుల్ హయాతి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో కుక్కలను బంధించి తీసుకెళ్తున్న వీడియో షేర్ చేస్తూ తెలంగాణలో ఇలాగే జరుగుతుంది, ఎవరైనా ఆపండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ మయాతి పోస్ట్ వైరల్‌గా మారింది…