Home   »  వార్తలుజాతీయంతెలంగాణరాజకీయం   »   మోదీ పర్యటనను నిరసిస్తూ వరంగల్‌లో వెలసిన ఫ్లెక్సీలు

మోదీ పర్యటనను నిరసిస్తూ వరంగల్‌లో వెలసిన ఫ్లెక్సీలు

schedule yuvaraju

ఓరుగల్లు: ప్రధాని పర్యటనను నిరసిస్తూ వరంగల్‌ పట్టణంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ‘నేను వరంగల్‌-నాది తెలంగాణ’ అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మామునూరు ఎయిర్‌పోర్టు ఏమైంది మోదీ?, గిరిజన విశ్వవిద్యాలయం ఏది?, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏమైంది? రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఐటీఐఆర్‌ (ITIR) ఏమయ్యాయంటూ ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు వెలశాయి. తెలంగాణలో పర్యటించే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాని మోదీ పర్యటనను ఇప్పటికే BRS పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా నేడు ములుగులో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ హాజరుకానున్నారు.