Home   »  వార్తలు   »   Golden |బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం: సీఎం కేసీఆర్..

Golden |బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం: సీఎం కేసీఆర్..

schedule mounika

బంగారు( Golden )తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం కేసీఆర్ అన్నారు . సీఎం కేసీఆర్ సెప్టెంబర్16వ తేదీన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్‌ ను ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు ఈ ప్రాజెక్టు సిద్ధమైంది. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి మరుసటి రోజున ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలోని ప్రతీ గ్రామంలో ప్రజలు, గ్రామ సర్పంచులు దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయనున్నారు.

బంగారు(Golden ) తెలంగాణ లక్ష్యం సంపూర్ణం..

సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించు కుందామని, దక్షిణ తెలంగాణకు పండుగ రోజని అన్నారు.

పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనుందని, బంగారు(Golden ) తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం కేసీఆర్ అన్నారు .

ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషితో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైందని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేయాలనుకున్నామని, పట్టుదలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషిలో కీలక పాత్ర పోషించిన సీఎంవో అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు.