Home   »  వార్తలు   »   గ్రామాలకు రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు..

గ్రామాలకు రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు..

schedule mounika

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని గిరిజన అవాస గ్రామాలకు రోడ్డు మరియు మౌలిక సదుపాయాల కోసం రూ.26.39కోట్లు నిధులు మంజూరు…

ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని అడిగిన వెంటనే మంజూరు చేసిన రాష్ట్ర స్త్రీ శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర రావు కి మంత్రి సత్యవతి రాథోడ్ కి నియోజకవర్గ గిరిజన ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేసిన భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి..

నిధులు మంజూరు అయిన గ్రామాల పనుల వివరాలు :

  • రూ.185లక్షలతో భూపాలపల్లి మండలం రాంపూర్ నుంచి చికెన్ పల్లి వరకు బీటీ రోడ్డు
  • రూ.365లక్షలతో ఆర్ అండ్ బి రోడ్ రాజీవ్ నగర్ నుంచి పంబపూర్ వరకు బిటి రోడ్డు
  • రూ.180 లక్షలతో దూదేకులపల్లి నుంచి దునికెలమడుగు వరకు బీటీ రోడ్డు
  • రూ.360లక్షలతో నాగారం గ్రామం నుంచి మీనాజీపేట మరియు గొల్ల బుద్ధారం తండా నుంచి రాజు నాయక్ కుంట వరకు బిటి రోడ్ పనులు
  • రూ.189లక్షలతో నాగారం గ్రామం నుంచి కిష్టాపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు
  • రూ.180లక్షలతో చిట్యాల మండలం గుంటూరు పల్లి నుంచి ఆర్ అండ్ బి రోడ్డు వరకు బీటీ రోడ్డు పనులు
  • రూ.180 లక్షలతో ఆర్ అండ్ బి రోడ్ నుంచి లక్ష్మీపురం తండా గ్రామానికి బీటీ రోడ్డు
  • రూ.580 లక్షలతో శాయంపేట మండలం కొప్పుల గ్రామం నుంచి పరకాల రోడ్డు ఎన్ హెచ్ కొరకు బీటీ రోడ్డు.
  • రూ.200లక్షలతో ఆర్ అండ్ బి రోడ్డు నుంచి నూర్జహాన్ పల్లి గ్రామానికి మరియు కాట్రపల్లి గ్రామం నుంచి రాజు పల్లి గ్రామానికి బిటి రోడ్డు పనులు
  • రూ.220లక్షలతో శాయంపేట మండలం నూర్జన్ పల్లి గ్రామం నుంచి వసంతపూర్ వరకు బిటి రోడ్డు

గిరిజన అవాస గ్రామాలకు రోడ్డు మరియు మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయడం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు.