Home   »  వార్తలు   »   నవజాత శిశువుల కోసం ICU ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి

నవజాత శిశువుల కోసం ICU ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి

schedule sirisha

విజయవాడ: పాత ప్రభుత్వాసుపత్రిలో రూ.4.28 కోట్లతో నిర్మించిన ప్రత్యేక నవజాత శిశువుల కోసం ICU ని శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ఝాన్సీ అన్నారు.

40 పడకల నియోనాటల్ వింగ్‌ను ఏర్పాటుకు ప్రభుత్వం రూ.31.51 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. కామెర్లు ఇతర వ్యాధులతో జన్మించిన తక్కువ బరువు గల శిశువులకు ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 61 ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్లు ఉన్నాయి. శిశు మరణాల నివారణకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రత్యేక నవజాత సంరక్షణ ప్రధానమని మంత్రి అన్నారు.