Home   »  వార్తలుతెలంగాణ   »   తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 22 గేట్లు ఎత్తివేత

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. 22 గేట్లు ఎత్తివేత

schedule raju

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాద్రి కోటగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఎగువ ప్రాంతంలోని చట్టిగడ్డ అడవుల్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు జలాశయానికి వాగులు, వంకల నుంచి తీవ్ర వరద పోటెత్తుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 22 గేట్లను 60 సెంటీమీటర్ల మేర ఎత్తి 26,958 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉన్నారని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.