Home   »  వార్తలుజాతీయం   »   జూలై నెలలో భారీగా GST వసూళ్లు..

జూలై నెలలో భారీగా GST వసూళ్లు..

schedule raju

జూలై నెలలో GST రూపంలో రూ.1,65,105 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది జూలైలో రూ.1.48 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 11% మేర వృద్ధి చెందాయి. GST ఆదాయం రూ.1.6 లక్షల కోట్లు దాటడం ఇది ఐదోసారి. తాజా వసూళ్లలో CGST రూ.29,773 కోట్లు, SGST రూ.37,623 కోట్లు.. IGST రూ. 85,930 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. సెస్సుల రూపంలో మరో రూ.11,799 కోట్లు సమకూరాయి.