Home   »  వార్తలుతెలంగాణ   »   సెల్ఫీ వీడియో తీసుకుంటూ భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం.

సెల్ఫీ వీడియో తీసుకుంటూ భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం.

schedule mounika

జనగామ జిల్లాలో నర్మెట్ట మండలం, సూర్యబండతండా గ్రామంలో సెల్ఫీ వీడియో తీసుకుంటూ భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇరుగు, పొరుగువారు గమనించి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతోంది. నర్మెట్ట మండలం, సూర్యబండతండా గ్రామానికి చెందిన గురు, సునీత .తమ భూమిని కొంతమంది దళారులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం దక్కకపోవడంతో భార్యాభర్తలు తీవ్ర మనస్తాపం చెంది పురుగులు మందు సేవించి ఆత్మహత్యయత్నం చేశారు. భూమి కబ్జా చేసిన వారి పేర్లు సెల్ఫీ వీడియోలో బాధితులు పేర్కొన్నారు….