Home   »  వార్తలు   »   నూతనంగా ఏర్పాటైన పాల్వంచ మండలంలో ఎం.ఆర్‌.ఓ కార్యాలయ ప్రారంభం

నూతనంగా ఏర్పాటైన పాల్వంచ మండలంలో ఎం.ఆర్‌.ఓ కార్యాలయ ప్రారంభం

schedule chiranjeevi

కామారెడ్డి: జిల్లాలోని పాల్వంచ మండలం లో నూతనంగా ఏర్పాటైన రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన మండల రెవెన్యూ కార్యాలయాన్ని (ఎంఆర్‌వో) ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు.

సంక్షేమ పథకాల అమలులో, అభివృద్ధి పనుల్లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని, మండలంలోని అన్ని కొత్త ప్రభుత్వ కార్యాలయాలను త్వరలో నిర్మిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కొత్తగా ఏర్పడిన మండలంలో ఎల్పుగొండ, వాడి, ఫరీద్‌పేట్, బండ రామేశ్వర్ పల్లి, ఇసాయిపేట్, దేవన్‌పల్లి, పోతారం, పాల్వంచ, భవానీపేట్ 10 గ్రామాలు ఉన్నాయి. దీంతో కామారెడ్డి జిల్లాలో మొత్తం మండలాల సంఖ్య 24కి చేరింది.