Home   »  వార్తలుజాతీయం   »   IRCTC-రూ.10లక్షల ఆటోమేటిక్‌ బీమా

IRCTC-రూ.10లక్షల ఆటోమేటిక్‌ బీమా

schedule raju

IRCTC లో టికెట్‌ బుక్‌ చేసుకునే వారు బీమా కోసం ఇకపై ఆప్షన్‌ ఎంచుకోవాల్సిన పనిలేదు. డిఫాల్ట్‌గా ప్రతి ఒక్కరూ బీమాకు అర్హత పొందుతారు. టికెట్లు అయిపోతాయనే తొందరలో చాలామంది బీమా ఎంచుకోకపోవడం, ఇటీవల ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో IRCTC ఈ నిర్ణయం తీసుకుంది. బీమా ఉన్న వారు చనిపోతే, శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే కుటుంబానికి ₹10 లక్షలు, గాయపడి అంగ వైకల్యం ఏర్పడితే ₹7.5 లక్షలు, క్షతగాత్రులకు ₹2 లక్షలు ఇస్తారు.

ఈ బీమాను 2 నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అందించాయి – SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. IRCTC ప్రయాణ ప్రమాద బీమా పథకం కింద ప్రయాణికులకు బీమా రక్షణ ఉందని బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తెలిపింది.