Home   »  వార్తలు   »   మాజీ ఎంపీ జయప్రదకు జైలు శిక్ష

మాజీ ఎంపీ జయప్రదకు జైలు శిక్ష

schedule mounika

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలల జైలు.. రూ.5 వేలు జరిమానా విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఒక సినిమా థియేటర్ ఉంది. దానిని చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి నడిపించారు. అయితే ఈ సినిమా థియేటర్‌లో పని చేస్తున్న కార్మికుల నుంచి ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టారు . దీంతో కార్మికులు ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కార్మికులకు చెల్లించాల్సిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లిస్తానని.. కాబట్టి పిటిషన్‌ను కొట్టివేయాలని ఎగ్మోర్ కోర్టును జయప్రద కోరారు. దీనికి లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో కేసుపై విచారణ జరిపిన ఎగ్మోర్ కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అలాగే.. రూ.5 వేలు జరిమానాను విధించింది….