విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి మూవీ టైటిల్ సాంగ్ విడుదలపై చిత్ర యూనిట్ అప్డేట్ రిలీజ్ చేసింది. అందరూ ఎదురుచూస్తున్న ఈ పాటను జూలై 28న విడుదల చేస్తామని తెలిపింది. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలు సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఖుషి మూవీ నుంచి మూడో పాట రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.