Home   »  వార్తలుఉద్యోగంతెలంగాణ   »   అర్థరాత్రి లేడీస్‌ హాస్టల్‌లో మంటలు

అర్థరాత్రి లేడీస్‌ హాస్టల్‌లో మంటలు

schedule yuvaraju

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం జవహర్‌నగర్‌ KGBV(కస్తూర్బా) లేడీస్‌ హాస్టల్‌ లో అర్ధరాత్రి 12:45 గంటలకు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఏ హాని జరగలేదని, పలువురి బట్టలు, పుస్తకాలు మంటలో కాలిపోయాయని సర్పంచ్‌ రమేష్‌ తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రంతా విద్యార్థులు బయటే ఉన్నారని హాస్టల్‌ నిర్వాహకులు తెలిపారు.