భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCl) లో మెయింటెనెన్స్, ఫైర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్ మరియు ఇతర విభాగాలలో పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసే అభ్యర్థులు డిప్లొమా, BE, B.Tech లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించబడింది మరియు జూలై 19 వరకు ఉచితంగా HPCL వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 29
పోస్టులు : మెయింటెనెన్స్ ఇంజనీర్, ఆఫీసర్
అర్హతలు: పోస్టులను బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
వయస్సు : పోస్టులను బట్టి 27 నుంచి 34 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : పోస్టులను బట్టి నెలకు రూ.40,000 నుంచి రూ. 1,60,000 వరకు
అప్లికేషన్ ఫీజు: లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 19
పని ప్రదేశం : ముంబయి, గుజరాత్
వెబ్సైట్: www.hindustanpetroleum.com