Home   »  అంతర్జాతీయంజాతీయంరాజకీయంవార్తలు   »   అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో భేటీ: ప్రధాని నరేంద్ర మోదీ

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో భేటీ: ప్రధాని నరేంద్ర మోదీ

schedule yuvaraju

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు వాషింగ్టన్ డీసీ లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్(NSF)ని ప్రధాని మోదీ, అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ సందర్శించారు. 2 దేశాల ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన పరిశ్రమల్లో విజయం సాధించేందుకు నైపుణ్యాలను నేర్చుకుంటున్న అమెరికా మరియు భారతదేశ విద్యార్థులను వారు కలిశారు.

MEA అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ యువతలో వృత్తి విద్య మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సాధించిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ మరియు అమెరికా ప్రథమ మహిళ పాల్గొన్నారు. భవిష్యత్ కోసం శ్రామిక శక్తిని సృష్టించే లక్ష్యంతో వారు చేస్తున్న సహకార ప్రయత్నాలను చర్చించారు. విద్య, పరిశోధన మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి భారతదేశం చేపట్టిన వివిధ కార్యక్రమాలను శ్రీ మోదీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ వాషింగ్టన్ డీసీని సందర్శించిన వెంటనే యువకులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులను కలుసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేసి, నిర్వ‌హించినందుకు ప్ర‌ధ‌మ మహిళ జిల్ బిడెన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సమావేశం లో Ms బిడెన్ మాట్లాడుతూ ఈ అధికారిక పర్యటనతో వారు ప్రపంచంలోని పురాతన మరియు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలను ఒక చోటికి తీసుకువస్తున్నారని అన్నారు. సంబంధ బాంధవ్యాలు కేవలం ప్రభుత్వాలకు సంబంధించినది కాదని, ఇరు దేశాల మధ్య ఉన్న కుటుంబాలు మరియు స్నేహాన్ని తెలుపుతాయి అని ఆమె అన్నారు. ప్రపంచ సవాళ్లను సమిష్టి గా ఎదుర్కోవడంలో అమెరికా-భారత భాగస్వామ్యం లోతైనది మరియు విస్తృతమైనది అని Ms బిడెన్ అన్నారు.