Home   »  వార్తలు   »   Minister KTR|ఈ నెల 9 న వరంగల్‌ కు మంత్రి కేటీఆర్..

Minister KTR|ఈ నెల 9 న వరంగల్‌ కు మంత్రి కేటీఆర్..

schedule mounika

ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌(Minister KTR) ఈ నెల 9న వరంగల్‌ నగరానికి రానున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు.

మంత్రి కేటీఆర్(Minister KTR) వరంగల్‌ రాక..

వరంగల్‌ నగరంలో నిర్మించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని ఈ నెల 9న ఆయన జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

నగరంలో మధ్య తరగతి వర్గాల కోసం కుడా ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తామని మధ్య తరగతి వర్గాలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కోనుగోలు చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. .

హైదరాబాద్‌ తర్వాత రెండో నగరంగా వరంగల్‌ ..

పెద్దమ్మగడ్డ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ఆ గృహ సముదాయంలో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు.

చారిత్రక వరంగల్‌ నగరంపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ తెలిపారు.

హైదరాబాద్‌ తర్వాత రెండో నగరంగా ఉన్న వరంగల్‌ అభివృద్ధి కోసం తొమ్మిదేండ్లలో రూ.4,500 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు.

కాళోజీ కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచాలి..

నగరంలో రూ.3 కోట్లతో చేపట్టిన 19 జంక్షన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వరదల వల్ల జరిగిన నష్టానికి మంత్రి కేటీఆర్‌ రూ.250 కోట్లు మంజూరు చేశారని చీఫ్‌ విప్‌ తెలిపారు.

నగరానికి విచ్చేసిన ఎంఏయూడీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాళోజీ కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు…….

హైదరాబాద్‌ తరహాలో ఎన్‌ఎస్‌డీపీ అమలు..

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అన్నారు.

ఇటీవల వరద వల్ల నగరం ముంపునకు గురికావడంతో వాటి నివారణకు హైదరాబాద్‌ తరహాలో ఎన్‌ఎస్‌డీపీ అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ఇటీవల వరదలతో జవహర్‌కాలనీ, పరిమళ కాలనీలో తీవ్ర నష్టం జరిగిందన్నారు. అక్కడి నాలాలను విస్తరించాలని సూచించారు. అభివృద్ది పనులను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.