Home   »  వార్తలు   »   రైస్ మిల్లు సిబ్బంది చెంప చెల్లుమనిపించిన MLA గంప గోవర్దన్.

రైస్ మిల్లు సిబ్బంది చెంప చెల్లుమనిపించిన MLA గంప గోవర్దన్.

schedule chiranjeevi

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ధాన్యం తడిసిపోయింది. ఈ నేపథ్యంలో రైస్‌మిల్లులో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు చాలా రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ విషయం కలెక్టర్ కు తెలియడంతో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్‌మిల్లర్లు మిల్లుల వద్ద ధాన్యాన్ని దించుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మిల్లర్లు చెప్పడంతో సమయం కావాలని కోరారు.

అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో.. మరొకసారి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ రైతుల నుంచి ఫిర్యాదు వెళ్లింది. దీంతో నేరుగా రైస్ మిల్‎కు రైతులతో వచ్చిన ఎమ్మెల్యే సిబ్బందితో మాట్లాడారు. ఈ సమయంలో సరైన సమాధానం ఇవ్వలేదన కారణంగా చేయిచేసుకున్నారు. ఈ పరిణామంపై రైస్ మిల్లు యాజమాన్యం నిరసనకు దిగింది. గంప గోవర్దన్ క్షమాపణ చెప్పాలని మిల్లులో లోడింగ్ నిలిపివేశారు. దీంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మిల్లర్లతో అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.