Home   »  వార్తలు   »   MLA Ravindra : కుల,మతాల ఐక్యతను పెంచిన ఘనత CM కేసీఆర్‌

MLA Ravindra : కుల,మతాల ఐక్యతను పెంచిన ఘనత CM కేసీఆర్‌

schedule mounika

కుల,మతాల ఐక్యతను పెంచిన ఘనత ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్(MLA Ravindra Kumar ) అన్నారు.

బుధవారం దేవరకొండ పట్టణంలో రూ.14.22లక్షలతో చేపడుతున్న ముస్లిం, మైనార్టీల ఖబరస్థాన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడంతో పాటు మైనార్టీల సంక్షేమంలోనూ తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అని ఆయన అన్నారు.

అన్ని వర్గాలను కాపాడుకునే, అన్ని మతాలను గౌరవించే నాయకుడు సీఎం కేసీఆర్ అని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్(MLA Ravindra Kumar ) అన్నారు.

నాడు ఉమ్మడి పాలనలో మైనార్టీలకు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుని కుల, మత పంచాయతీలను ప్రోత్సహించారు తప్ప వారికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.

కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యతను కల్పించి అక్కున చేర్చుకుని అండగా నిలుస్తున్నామన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజ‌యం సాధించి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ‌ను సాధించిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింద‌ని, దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌ని చెప్పారు.

కేంద్రం సహకరించుకున్న ప్రతి మనిషికి 6 కేజీల బియ్యాన్ని అందిస్తూ మైనార్టీలలోని నిరుపేదలని ఆదుకుంటున్నారని తెలిపారు.

తెలంగాణ ఎక్కడ ఉన్నది అనే స్థితి నుంచి ప్రపంచమంతా తెలంగాణ వైపే చూసే స్థితికి చేరిందన్నారు. తిండిలేక ఇబ్బంది‌పడ్డ తెలంగాణ దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరింది.

మైనారిటీలు అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసి వారిని విద్యలో పురోభివృద్ధి చెందటానికి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. వారి అభివృద్ధికి చదువు ఎంతో ఉపయోగపడుతుందనే ఆలోచనతో గురుకులాలను పెట్టి వారిని ఆదుకుంటున్నరు అని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆసియాలోనే అతి పెద్ద బాహుబలి ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగు జలాలు అందించినట్టు చెప్పారు.

సీఎం కేసీఆర్‌, బీఆర్ఎస్ ప్రభుత్వ ప‌నితీరును ప్రజ‌లు మెచ్చార‌ని, ఇంత జ‌న‌రంజ‌కంగా, ప్రజోప‌యోగంగా ప‌రిపాల‌న చేసిన సీఎంలు గ‌తంలో రాలేద‌న్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ‌లో మ‌ళ్లీ రావాల‌ని, ప్రజ‌లు కోరుకుంటున్నారని తెలిపారు.

రాష్ట్రంలో మూడు పంటలు పండేందుకు నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చే సీఎం కేసీఆర్‌ కావాలో, మూడు గంటల కరెంటు చాలు అనే కాంగ్రెస్‌ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు.

పేదలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మైనార్టీ బంధు అందిస్తుంది అని ఆయన చెప్పారు. మైనార్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్‌ మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో ప్రత్యేక నిధులు వెచ్చించి వారిని ఆదుకుంటున్నారని చెప్పారు.