Home   »  వార్తలుజాతీయం   »   జీ-20 వేదికను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.

జీ-20 వేదికను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.

schedule raju

జీ-20 నాయకుల సమావేశానికి ఆతిథ్యమిచ్చేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) ఆధీనంలో ఉన్న సువిశాల కాంప్లెక్స్‌ను రీడెవలప్ చేసిన కేంద్ర ప్రభుత్వం జులై 26న ప్రారంభించనుంది. ప్రధాని మోదీ ఈ వేదికను ప్రారంభించనున్నారు.

సుమారు 123 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన భారత్‌లోని అతిపెద్ద మైస్ MICE (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) కేంద్రంగా ఇది రికార్డు నెలకొల్పింది. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌లోని ౩వ లెవల్‌లో 7వేల మంది కూర్చునేలా నిర్మించిన మీటింగ్‌ హాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

కొత్తగా సిద్ధం చేసిన ఈ వేదికలో లోటుపాట్లను గుర్తించి సరిదిద్దేందుకు జీ-20 సన్నాహక సమావేశాలు సహా అనేక ఇతర సమావేశాలను ప్రభుత్వం ఇక్కడ ఇప్పటికే నిర్వహించింది.ఈ ఆధునిక IECC కాంప్లెక్స్ ప్రపంచంలోని టాప్ 10 ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కాంప్లెక్స్‌లలో ఒకటిగా నిలిచింది.