Home   »  వార్తలు   »   Redemption | విమోచన దినోత్సవ వేడుకకు కేసీఆర్ రావాల్సిందే..

Redemption | విమోచన దినోత్సవ వేడుకకు కేసీఆర్ రావాల్సిందే..

schedule mounika

సీఎం తెలంగాణ విమోచన(Redemption) దినోత్సవం వేడుకకు రావాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

గత ఏడాది కేంద్ర అధీనంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు రాకుండా డుమ్మా కొట్టిన కేసీఆర్.. ఈ ఏడాది కూడా కేసీఆర్‌కు విమోచన దినోత్సవం వేడుకలకు ఆహ్వానం పంపిస్తామన్నారు.

తెలంగాణ విమోచన(Redemption) దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను కెసిఆర్ మోసం చేశాడని కేంద్రమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమోచన దినోత్సవం జరపాలని గతంలో కాంగ్రెస్ ను నిలదీసిన కేసిఆర్.. నేడు ఎందుకు విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నా.. ఎందుకు అధికారికంగా జరపలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.

కేంద్రం అధీనంలో ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయన్నారు. సెప్టెంబరు 17 సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయన్నారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.

ఈ వేడుకలు జరిపితే పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు.

మీరు మీటింగులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ అదే రోజు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్‌తో కుమ్మక్కై విమోచన దినోత్సవ వేడుకలను పక్కదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ 25 ఏళ్లుగా పోరాటం చేస్తోందని అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ.. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదని మండిపడ్డారు.

ఈ విషయంలో బీజేపీ రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ ఉత్సవాలు జరిపి తీరుతామని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 17న విలీన దినోత్సవం జరుపుతుంటే.. అందుకు విరుద్ధంగా బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతోంది.