Home   »  వార్తలుఅంతర్జాతీయంజాతీయంవినోదం   »   అక్టోబర్‌ 13న “Salaar” ఇంగ్లీష్‌ వెర్షన్‌ రిలీజ్‌?

అక్టోబర్‌ 13న “Salaar” ఇంగ్లీష్‌ వెర్షన్‌ రిలీజ్‌?

schedule raju

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘Salaar’తో వరల్డ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేయనుంది. ఈ సినిమాను ఇంగ్లీష్‌ వెర్షన్‌లో రిలీజ్‌ చేసి.. ఇండియన్‌ సినిమా రేంజ్‌ చూపించనున్నారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్‌ 28న పాన్‌ ఇండియాలో Salaar రిలీజ్‌ కానుంది. 15 రోజుల తర్వాత అక్టోబర్‌ 13న ఇంగ్లీష్‌ వెర్షన్‌ రిలీజ్‌ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.

KGF -2 బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈమూవీపై టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు అన్ని భాష‌ల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా స‌లార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్‌. అంత‌ర్లీనంగా ఈ మూవీలో మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు ఫ్రెండ్‌షిప్ అంశాల‌ను ప్ర‌శాంత్ నీల్ ట‌చ్ చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది.