Home   »  వార్తలు   »   భారత్ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు లీక్ చేసిన శాస్త్రవేత్త అరెస్ట్.

భారత్ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు లీక్ చేసిన శాస్త్రవేత్త అరెస్ట్.

schedule chiranjeevi

DRDO సైంటిస్ట్ అరెస్ట్: పాకిస్థాన్‌కు భారత్ రహస్య సమాచారాన్ని అందించిన శాస్త్రవేత్త ఇటీవల అరెస్ట్‌ అయ్యారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో పనిచేస్తున్న ఓ శాస్త్రవేత్త వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా పాకిస్థాన్ ఏజెంట్‌కు భారత్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు శాస్త్రవేత్తను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) గురువారం అరెస్టు చేసింది.

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఏజెంట్ వేసిన హనీ ట్రాప్‌లో శాస్త్రవేత్త చిక్కుకున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. వారితో నిత్యం టచ్ లో ఉంటూ భారత్ కు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించినట్లు వెల్లడైంది. తన వద్ద ఉన్న దేశానికి సంబంధించిన రహస్య సమాచారం దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందని తెలిసి ఆ శాస్త్రవేత్త అధికార దుర్వినియోగానికి పాల్పడి శత్రు దేశానికి సమాచారం అందించాడని తెలిపారు.

అధికారిక రహస్యాల చట్టం మరియు ఇతర సెక్షన్ల కింద శాస్త్రవేత్తపై కేసు నమోదు చేయబడింది. ఈ వ్యవహారంలో మరెవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో లోతుగా విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. అరెస్టయిన శాస్త్రవేత్త ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ అధికారి అని చెప్పారు.