Home   »  వార్తలు   »   పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం-మార్విన్ తెలుగు

పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం-మార్విన్ తెలుగు

schedule chiranjeevi

పాఠశాల విద్యపై కొత్త సచివాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభవార్త అందించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వర్క్‌ బుక్స్‌, హైస్కూల్‌ విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు ఇవ్వాలని ఆమె అధికారులకు సూచించారు. విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయంలో పిల్లలకు వర్క్ బుక్స్, నోట్ పుస్తకాలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల నేతృత్వంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందజేయాలని విద్యాశాఖ మంత్రి అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమాలకు తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలి పాఠశాలలు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫారాలు అందజేయాలని మంత్రి సూచించారు. యూనిఫాం కోసం దాదాపు రూ.150 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. గత విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం రూ.132 కోట్లు ఖర్చు చేయగా, వచ్చే విద్యా సంవత్సరానికి రూ.200 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున ఆ రోజు పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొల్పాలని మంత్రి ఆదేశించారు. శిక్షణ కార్యక్రమం నిర్వహించి స్థానిక నాయకులను భాగస్వాములను చేయాలని సూచించారు.

జూన్ మొదటి వారంలోగా మన ఊరు-మన బడి పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అయితే ఈసారి విద్యార్థుల యూనిఫాం రంగు మారనుంది. ఎరుపు, యాష్ కలర్ కాంబినేషన్‌లో యూనిఫామ్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే అబ్బాయిలు, బాలికలకు వేర్వేరుగా మూడు కేటగిరీల్లో యూనిఫాం డిజైన్ లుక్‌ను విడుదల చేశారు. ఈ యూనిఫాం లుక్ కార్పొరేట్ స్టైల్‌తో రాజీపడదు.