Home   »  వార్తలుతెలంగాణ   »   విద్యుత్ సరఫరా లో సరికొత్త రికార్డులు సృష్టించిన తెలంగాణ రాష్ట్రం : B.వినోద్ కుమార్

విద్యుత్ సరఫరా లో సరికొత్త రికార్డులు సృష్టించిన తెలంగాణ రాష్ట్రం : B.వినోద్ కుమార్

schedule yuvaraju

రాజన్న-సిరిసిల్ల : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వివిధ రంగాలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని TS ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు B.వినోద్ కుమార్ అన్నారు.

విద్యుత్ రంగం వృద్ధి సానుకూల దిశలో పయనిస్తోందని, తరచు కరెంటు కోతల సమస్యను అధిగమించి నిరంతర విద్యుత్‌ సరఫరా చేసే స్థితికి తెలంగాణ చేరుకుందన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన విద్యుత్‌ దినోత్సవంలో వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు 24 గంటల నిరంతర కరెంట్‌ సరఫరా చేస్తున్నామన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త సబ్ స్టేషన్ల ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి సాధించాం. ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉత్పత్తి దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోంది.

కొత్త విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, ఉపకేంద్రాల ఏర్పాటు, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటుతో తలసరి విద్యుత్ వినియోగం 2,140 యూనిట్లకు చేరుకుంది. ఇది జాతీయ సగటు 1,255 యూనిట్ల కంటే 70 శాతం ఎక్కువ.