Home   »  తెలంగాణవార్తలు   »   బోరబండలో కలకలం రేపిన పసికందు మృతదేహం

బోరబండలో కలకలం రేపిన పసికందు మృతదేహం

schedule sirisha

హైదరాబాద్: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బోరబండ కుంట (గుడిసెలు) వద్ద తల లేని నవజాత శిశువు మృతదేహం కనిపించింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో మూట కట్టి పడేసి వెళ్లారు.

కుక్కలు ఆ కవర్ను రోడ్డు మీదకు తీసుకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్ళిపోయి దుర్వాసన వస్తుండడం తో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందిచారు

పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా తల లేని నవజాత శిశువు మొండెం గా గుర్తించారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.