Home   »  తెలంగాణవార్తలు   »   గర్భిణి అని కనికరం లేకుండా కత్తితో పొడిచిన భర్త..

గర్భిణి అని కనికరం లేకుండా కత్తితో పొడిచిన భర్త..

schedule yuvaraju

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి చెందిన అనిల్, శ్యామల భార్యా భర్తలు. శ్యామల ప్రస్తుతం గర్భిణి. అయితే డబ్బు విషయంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో భర్త అనిల్ క్షణికావేశంలో గర్భంతో ఉన్న భార్య శ్యామలను కత్తితో పొడిచాడు. శ్యామల గట్టిగా కేకలు వేయడంతో అనిల్ అక్కడి నుంచి పరారయ్యాడు.

గమనించిన స్థానికులు గర్భిణి శ్యామలను అంబులెన్స్ లో హుటాహుటినా ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని, చికిత్స కొనసాగుతుందని వైద్యులు వెల్లడించారు.