Home   »  తెలంగాణవార్తలు   »   భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

schedule sirisha

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం లోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి మళ్లీ వరద ఉధృతంగా ఉంది. నిన్న రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద మూడో వరద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం వరద 53 అడుగులకు పెరిగింది. వర్షాలు తగ్గినప్పటికీ వరదలు తగ్గుముఖం పట్టడం లేదు.

ఎగువ ప్రాంతాల్లోని ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నిలకడగా ఉందని, రానున్న 24 గంటల్లో ఇక్కడ గోదావరికి వరద తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ రోజు ఉదయం 9 గంటలకు కాటన్ బ్యారేజీ వద్ద 14.50 అడుగుల మేర వరద వచ్చింది. దిగువకు 13,83,537 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఎప్పటిలాగే డెల్టా కాలువలకు 4000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.