Home   »  జీవన శైలితెలంగాణవార్తలు   »   తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

schedule sirisha

హైదరాబాద్: తెలంగాణకు రానున్న నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రకటించింది.

ఆదిలాబాద్, కుమ్రంభీంఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.